
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ ఆరోగ్యంపై నిత్యానంద స్వామి స్పందించారు. త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. సద్గురు ఆరోగ్యం కోసం అన్ని దేవాలయాల్లో, కైలాసలో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు, హోమాలు చేస్తున్నట్లు తెలిపారు,
ఇటీవల సద్గురు హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రమైన తలనొప్పితో కొద్దిరోజులుగా ఇబ్బందిపడుతున్నారు. అయితే మార్చి 17న ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు సిటీ స్కాన్ చేస్తే మెదడులో ప్రాణాంతక పరిస్థితి ఉందని గుర్తించారు. అదేరోజు సద్గురుకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. కొన్ని గంటల్లోనే విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వేగవంతంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ బుధవారం సద్గురుతో ఫోన్‌లో మాట్లాడారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: Yusuf Pathan: పశ్చిమ బెంగాల్లో మాజీ క్రికెటర్ ఎన్నికల ప్రచారం..
ప్రస్తుతం సద్గురు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. అన్ని అవయవాలు పని చేస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఊహించిన దాని కంటే ఎక్కువగా సద్గురు కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం సద్గురు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో సమావేశాలు, సమ్మేళనానికి హాజరయ్యేందుకు సద్గురు వచ్చారు. హస్తినకు చేరుకున్నాక ఈ పరిస్థితులు తలెత్తాయి. సద్గురు ఆరోగ్యం గురించి ఈషా పౌండేషన్‌కు ప్రముఖులు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
THE SUPREME PONTIFF OF HINDUISM, BHAGAVAN SRI NITHYANANDA PARAMASHIVAM, prays to Paramashiva for the speedy recovery of PADMA VIBHUSHAN AWARDEE SADHGURU JAGADISH VASUDEV, Yogi, Mystic, Visionary, & Founder of the Isha Foundation, who has recently undergone emergency brain surgery… pic.twitter.com/hj0jn0xaoP
— KAILASA's SPH NITHYANANDA (@SriNithyananda) March 20, 2024