Leading News Portal in Telugu

kalpana soren: కేజ్రీవాల్ సతీమణితో కల్పనా సోరెన్ సంభాషణ.. ఏం సలహా ఇచ్చారంటే..!



Kalpana

ప్రస్తుతం సునీతా కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న సమస్యలను స్నేహితురాలిగా తాను అర్థం చేసుకుంటున్నానని కల్పనా సోరెన్ తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఆమె భర్త, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను కూడా జనవరిలో ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సతీమణి సునీతాతో కల్పనా సోరెన్ సంభాషించారు. సునీతాకు ధైర్యం చెప్పారు. ఆమె సమస్యలను తాను అర్థం చేసుకోగలనని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అనంతరం మార్చి 28 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌తో మాట్లాడారు. సునీతాకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించానని కల్పన తెలిపారు. స్నేహితురాలిగా ఆమె సమస్యలను అర్థం చేసుకోగలనని ఆమె తెలిపారు.

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ముఖ్యమంత్రులను అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదని.. అది కూడా దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత.. ఇలాంటి ఘటనలు దారుణం అని కల్పనా సోరెన్ పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో కేజ్రీవాల్‌కు తమ కుటుంబం అండగా నిలుస్తుందని కల్పన తెలిపారు.

గత జనవరిలో మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుం ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. ఇక హేమంత్ సోరెన్ వారసుడిగా చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇటీవలే హేమంత్ వదిన సీతా సోరెన్.. బీజేపీలో చేరారు.

ఇది కూడా చదవండి: Hardeep Puri: ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు