Leading News Portal in Telugu

Bihar: పురాతన గుహలో పట్టుబడ్డ మద్యం.. బీహార్లో ఘటన



Bihar

పురాతన కాలంలో ప్రజలు భూమిలోపల గుహలు తయారు చేసుకుని ఆశ్రయం పొందేవారు. ఇప్పుడున్న రోజుల్లో అలాంటి గుహలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే బీహార్‌లో ఇలాంటి గుహలను అక్కడి జనాలు చూశారు. ఈ గుహలో వెతకగా ప్రజలు ఆశ్చర్యపోయారు. అందులో భారీగా మద్యం ఉండటాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

MI vs GT: రాణించిన గుజరాత్.. ముంబై టార్గెట్ ఎంతంటే..?

గోపాల్‌గంజ్ జిల్లాలోని థావే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కబిలాస్‌పూర్ గ్రామంలో భూగర్భ గుహ నుండి పోలీసులు భారీ మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో మద్యం వ్యాపారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేశారు. అక్కడ ఒక మైదానంలో గుహ కనిపించడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అందులో వెళ్లి చూడగా.. భారీగా మద్యం కనపడింది. దీంతో పోలీసులు అండర్‌గ్రౌండ్‌ నుంచి మద్యం బయటకు తీశారు. అది చూసిన జనాలు షాక్ కు గురయ్యారు. బీహార్‌లో నిషేధం ఉన్నప్పటికీ, మద్యం వ్యాపారం పెద్ద ఎత్తున కొనసాగడం గమనించాల్సిన విషయం.

BJP 5th List: బీజేపీ ఐదో జాబితా విడుదల.. తెలంగాణలో ఇద్దరు, ఏపీలో 6గురు అభ్యర్థులు ప్రకటన

పోలీసులు గుహలో సోదాలు చేయగా అందులో నుంచి 205 లీటర్ల దేశీయ మద్యం లభించింది. మరోవైపు.. ముగ్గురు మద్యం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపారు. అంతకుముందు.. కబిలాస్‌పూర్ గ్రామంలో మద్యం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.