Leading News Portal in Telugu

BJP Protest: సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఆందోళన..



Bjp

దేశ రాజధాని ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)‌, ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా( బీజేపీ) పార్టీల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా ఆప్‌ శ్రేణులు గత మూడు రోజులుగా నిరసన చేస్తుండగా.. ఇక, కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ నేడు ( మంగళవారం ) బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో మూడు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న ఆప్‌ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలి వెళ్తున్నారు.

Read Also: Teachers Recruitment Scam: టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో బెంగాల్ మంత్రికి ఈడీ నోటీసులు..

ఈ క్రమంలో ఇవాళ ఢిల్లీలో బీజేపీ శ్రేణులు కూడా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసులు కమలం పార్టీ నేతలను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వాళ్లలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ కూడా ఉన్నారు. అయితే, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఇటీవల ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. అరెస్టైనా కూడా సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయకుండా ఈడీ కస్టడీ నుంచే సీఎంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాంతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుంది.