Leading News Portal in Telugu

Teachers Recruitment Scam: టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో బెంగాల్ మంత్రికి ఈడీ నోటీసులు..



Ed

టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ కుంభ కోణంలో ప‌శ్చిమ బెంగాల్ మంత్రి చంద్రనాథ్ సిన్హాకు ఎన్ ఫోర్స్మెంట్ (ఈడీ) ఇవాళ (మంగ‌ళ‌వారం) నోటీసులు జారీ చేసింది. మార్చి 22న సిన్హా నివాసంపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, మార్చి 27వ తేదీన ద‌ర్యాప్తు సంస్ధ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సిన్హాకు సమన్లు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది. ఇక, మంత్రి చంద్రనాథ్ సిన్హా ఇంట్లో దాడుల నేప‌ధ్యంలో ప‌లు ఆస్తి ప‌త్రాల‌ను, మొబైల్ ఫోన్‌తో పాటు 40 లక్షల రూపాయల న‌గ‌దును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: MLC Kavitha: తీహార్ జైలుకు కవిత.. ఏప్రిల్ 9 వరకు జ్యూడిషియల్ రిమాండ్..

అయితే, అంత పెద్ద భారీ మొత్తాన్ని ఇంటి దగ్గరకు ఎందుకు ఉంచాల్సివ‌చ్చింద‌నే విష‌యంపై మంత్రి చంద్రనాథ్ సిన్హా వివ‌ర‌ణ ఇవ్వలేదని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అధికారులు పేర్కొన్నారు. ఈడీ ఆయ‌న నివాసంపై దాడులు చేప‌ట్టిన సమయంలో బోల్పూర్‌కు 90 కిలో మీట‌ర్ల దూరంలోని త‌మ‌ పూర్వీకుల గ్రామం మురారైలో సిన్హా ఉన్నారు.