
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆరో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ హైకమాండ్ వెల్లడించింది. రాజస్థాన్‌కు చెందిన రెండు నియోజకవర్గాలు, మణిపూర్‌కు చెందిన ఒక నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్‌లోని కరౌలీ ధోల్పూర్ (ఎస్సీ), దౌసా నియోజకవర్గాలు, ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి అభ్యర్థులను వెల్లడించింది.
తొలి విడతలో 195 మందిని, రెండో విడతలో 72 మందిని, మూడో విడతలో 9 మందిని, నాల్గో విడతలో 15 మందిని, ఐదో విడతలో 111 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 405 మంది అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. మరికొన్ని స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి రికార్డ్ స్థాయిలో ఫలితాలు సాధించేందుకు కాషాయ పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు కట్టబెట్టాలని ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Varun Gandhi: “మాతో చేరడానికి వరుణ్ గాంధీకి స్వాగతం”.. కాంగ్రెస్ ఆఫర్..
దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనున్నాయి. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. అధికారం కోసం ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి తలపడుతున్నాయి. విజయంపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Anchor Suma : సుమ సౌందర్య తో కలిసి నటించిన సినిమా ఏదో తెలుసా?

Bjp