
PM Modi: శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ)కి బీజేపీ ఫిర్యాదు చేసింది. పీఎంని కించపరిచే విధంగా ఇద్దరు నేతలు వ్యాఖ్యలు చేశారని మంగళవారం ఫిర్యాదు చేశారు. విదర్భ ప్రాంతంలోని బుల్దానాలో జరిగిన ర్యాలీలో సంజయ్ రౌత్ ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీని ఔరంగజేబులో పోల్చారు. తమిళనాడు పశుసంవర్థక శాఖ మంత్రి అని రాధాకృష్ణన్ రాష్ట్రంలో జరిగిన ఓ సభలో ప్రధానిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.
Read Also: DK Shivakumar: దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియాగాంధీ చేశారు.. కాంగ్రెస్‌తోనే దేశం ఐక్యంగా ఉంటుంది..
ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్రలో జన్మించగా.. ఔరంగజేబు ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన నేటి గుజరాత్ ప్రాంతంలో జన్మించారని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. రౌత్ ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే కూడా అక్కడే ఉన్నారని, ఇద్దరు నేతలు ప్రధానికి క్షమాపణలు చెప్పాలని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ కూడా గుజరాత్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఫిర్యాదులో పేర్కొంది.
‘‘ మోడీ జన్మించిన గుజరాత్ లోని దాహోద్ అనే ప్రదేశం ఉంది. ఔరంగజేబు కూడా అక్కడే జన్మించాడు. కాబట్టి ఔరంగాజేబ్ వైఖరి గుజరాత్, ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వైపు కవాతు చేస్తోంది. శివసేనకు, మా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఉంది. మోడీ వచ్చాడని అనకండి, ఔరంగజేబు వచ్చారని చెప్పాంది. మేం వారిని పాతిపెడతాం’’ అంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, కామరాజర్ లాంటి దిగ్గజాలను సత్కరించేందుకే అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించినట్లు ప్రధాని మోడీ చెబుతున్నారు, కానీ ఓట్ల కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని గత వారం సేలంలో జరిగిన ఓ సభలో డీఎంకే మంత్రి రాధాకృష్ణన్ అన్నారు.