
భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఉంటాయి. ఒక్కో మహిళా సంఘం ఒక్కోరకమైన వ్యాపారాన్ని చేస్తూ ముందుకు వెళ్తుంటాయి. ఇకపోతే తాజాగా కేరళలోని కొందరు డ్వాక్రా మహిళలంతా కలిసి ‘కుటుంబశ్రీ’ ప్రాజెక్ట్ అనే పేరుతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇదివరకే ఈ గ్రూపు అనేక కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడు.. ఆహరం లోకి కూడా ప్రవేశించింది. వీరు ప్రారంభించిన కుటుంబ శ్రీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఆ ప్రాంతంలో మంచి పేరును సంపాదించుకుంది. ఈ సంఘంలో చాలామంది మహిళలు పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద భోజనాన్ని వెజ్, నాన్ వెజ్ తరహాలో కస్టమర్స్ కి డెలివరీ చేస్తారు.
Also read: Gold Price Today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఈ ప్రాజెక్టు కింద పాకెట్ మార్ట్ అనే మొబైల్ యాప్ ద్వారా ఉదయం 6 గంటల నుంచి లంచ్ బాక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక మరుసటి రోజు కోసం సాయంత్రం 6 గంటలకు తరువాత ఆర్డర్ ఇవ్వచ్చు. వీటికి సంబంధించి ఉదయం 11 గంటల తర్వాతే బాక్సులను డెలివరీ చేయబడతాయి. మళ్లీ తెచ్చిన వారే మధ్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చి కాళీ బాక్స్లను తీసుకువెళ్తారు. ఇక వీరు భోజనానికి శాఖాహారం భోజనానికి 60 రూపాయలు, అలాగే మాంసాహారానికి 90 రూపాయలను వసూలు చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా కేవలం స్థానిక వంటలకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Also read: CSK vs GT: గుజరాత్ పై చెన్నై గెలుపు.. వరుసగా రెండో విక్టరీ
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు డెలివరీ కేవలం ఐదు ఏరియాలకు మాత్రమే అందుబాటులో ఉందని ప్రాజెక్ట్ మేనేజర్ తెలిపారు. ముందుముందు మరింతగా ఈ ప్రాజెక్టును విస్తరించబోతున్నట్లు వారు తెలిపారు.