
మాల్దీవులకు మరో కొత్త కష్టం వచ్చి పడింది. ప్రధాని మోడీపై మాల్లీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యల తర్వాత ఇండియన్స్ పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో మాల్దీవులు తీవ్రంగా నష్టం పోయింది. తాజాగా ఇప్పుడు మంచినీటి కష్టాలు వచ్చి పడ్డాయి. తాగునీరు లేక అల్లాడుతోంది. దీంతో సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపించింది.
ఇది కూడా చదవండి: Delhi Liquor case: గోవా వంతు వచ్చింది.. ఆప్ లీడర్లకు ఈడీ సమన్లు
భారత్‌తో ద్వైపాక్షిక వివాదం తర్వాత మాల్దీవులకు అన్నివిధాలా సాయం చేస్తామని చైనా ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా ఆ దేశానికి 1,500 టన్నుల తాగునీరు అందజేసింది. టిబెట్‌లోని హిమనీ నదాల నుంచి చైనా వీటిని సేకరించింది.
ఇది కూడా చదవండి: SRH vs MI: ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ స్కోరు.. ముంబై ముందు భారీ టార్గెట్
మాల్దీవులతో ఇప్పటికే చైనా సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తమ దేశానికి చైనా బాష్ప వాయుగోళాలు, పెప్పర్ స్ప్రే వంటి సాధారణ అస్త్రాలను ఉచితంగా అందించడంతో పాటు సైనిక శిక్షణ ఇస్తుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు వెల్లడించారు. తాజాగా తాగునీటి కొరతను అధిగమించేందుకు సాయం చేసింది. చైనా పంపిన నీటితో తమ దేశంలో తాగునీటి కొరతను అధిగమించవచ్చని మాల్దీవుల విదేశాంగ శాఖ తెలిపింది. త్వరలోనే ఈ నీటిని అన్ని ప్రాంతాల్లో సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: BJP’s parody video: బీజేపీ ‘పెళ్లి చూపులు’ పేరడీ వీడియో.. ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం..