Leading News Portal in Telugu

Delhi Liquor case: గోవా వంతు వచ్చింది.. ఆప్ లీడర్లకు ఈడీ సమన్లు



Ed

ఢిల్లీ మద్యం కుంభకోణం ఇప్పుడు గోవాకు పాకింది. ఈ కేసులో గోవా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలకు ఎన్‌ఫోన్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆప్ నాయకులు అమిత్ పాలేకర్, రామారావు వాఘ్, దత్తా ప్రసాద్ నాయక్, భండారీ సమాజ్, అశోక్ నాయక్‌లకు నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలని ఈడీ సమన్లు అందించింది.

ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. సిసోడియా గతేడాది నుంచి జైల్లో ఉన్నారు. ఇటీవల కవిత, కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఈడీ కస్టడీలో ఉన్నారు. అరెస్ట్, కస్టడీపై కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ఏప్రిల్ 3కు హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇక కవిత ఈడీ కస్టడీ ముగియడంతో తీహార్ జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి: SRH vs MI: ఐపీఎల్‌ చరిత్రలో రికార్డ్ స్కోరు.. ముంబై ముందు భారీ టార్గెట్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అధికారులు పలువురిని అరెస్ట్ చేయడంతో పలు ఆస్తులను కూడా అటాచ్ చేశారు. కేజ్రీవాల్‌కు తొమ్మిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు డుమ్మా కొట్టడంతో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఈనెల 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. గురువారం కస్టడీ ముగియగానే కోర్టులో హాజరపర్చనున్నారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే కఠిన చర్యలు.. పవన్ హెచ్చరిక