
భారతదేశంలోని కొందరి రాజకీయ నాయకుల ఇళ్లలో ఎప్పుడైనా ఏసిబి, సిబిఐ, ఐటి డిపార్ట్మెంట్స్ దాడి చేసిన సమయంలో అనేకమార్లు కుప్పలుగా నోట్ల కట్టలు కనిపించడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. కొందరైతే ట్రంకు పెట్టెలో, ఇంటి గోడలలో, బీరువాలలో, మంచంలో ఎక్కడపడితే అక్కడ వారి అవినీతి సొమ్మును దాచేస్తూ ఉండడం మనం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. ఇలా అనేకమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఎంతోమంది వారి అక్రమ సొమ్ముతో దొరికిన సంఘటనలు చాలానే చూసాం. కాకపోతే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే మాత్రం షాక్ కొట్టాల్సిందే. దీనికి సంబంధించి వివరాలు చూస్తే..
Also read: Arvind Kejriwal: నేటితో ముగియనున్న కేజ్రీవాల్ ఈడీ కస్టడీ..
అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయవేత్త తన మంచంపై 500 రూపాయల నోట్లు వేసి వాటిపై పడుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అస్సాం రాష్ట్రంలోని ఉదయ్ గిరి జిల్లాలోని భైరగురి లో బెంజమిన్ బసుమతరీ బహుమతిని ఆ గ్రామ విలేజ్ కౌన్సిలర్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఆయన 500 నోట్లను మంచంపై పరుచుకొని నిద్రిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. అంతేకాదు ఆయనపై మరికొన్ని నోట్లో కట్టులను కూడా వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. దీంతో సదరు పార్టీ అతను సస్పెండ్ చేసింది.
Also read: Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా విదేశాంగ ప్రతినిధి..!
తాను ఉన్న పార్టీ నుంచి అతనిపై క్రమశిక్షణ తీసుకుంటున్నట్లు ఓ లేక అందినట్లు బోరో తెలిపారు. ఇకపోతే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫోటో ఆయన స్నేహితులు ఐదేళ్ల క్రితం వారింట్లో ఒక పార్టీ జరిగిన సమయంలో తీసినట్లు ఆయన స్పష్టం చేశారు. కాకపోతే ప్రస్తుతం ఎలక్షన్ నేపథ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.