Leading News Portal in Telugu

Satyam Surana: ప్రధాని మోడీకి మద్దతు ఇచ్చినందుకే నన్ను అలా చేస్తున్నారు.. భారతీయ విద్యార్థి సత్యం సురానా..!



111

పూణేలో జన్మించిన సత్యం సురానా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్‌ఎస్‌ఇ)లో విద్యార్థి సంఘం ఎన్నికలకు పోటీ పడుతుండగా., ఈ ఏడాది విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారంలో తనను లక్ష్యంగా చేసుకుని ‘ఫాసిస్ట్’ అని పిలిచారని ఆరోపించారు. గత ఏడాది యునైటెడ్ కింగ్‌ డమ్‌ లోని భారత హైకమిషన్‌ పై ఖలిస్తానీ శక్తులు దాడి చేసిన సమయంలో సత్యం సురానా దేశస్ఫూర్తితో త్రివర్ణ పతాకాన్ని నేలపై పాడడం చుసినా తర్వాత దానిని తీయడంతో వార్తల్లో నిలిచాడు.

Also Read: Fire Accident: మైలార్దేవ్పల్లిలో అగ్నిప్రమాద ఘటన.. బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం..

ప్రముఖ మీడియా సంస్థ ANIతో మాట్లాడుతూ., ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందు తనపై ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. తన ప్రత్యర్థులు తనను బీజేపీతో ముడిపెట్టారని, తనను బహిష్కరించేందుకు ‘ఫాసిస్ట్’ అని ముద్రవేశారని కూడా ఆయన ఆరోపించారు. ఈ సంఘటనల క్రమాన్ని వివరిస్తూ., లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎన్నికలు ఈ ఏడాది మార్చి ప్రారంభంలో ప్రకటించబడ్డాయి, ఆ తర్వాత తాను ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ దాఖలు చేశానని సత్యం తెలిపారు.

Also Read: 100 plastic surgeries: అలా కనిపించాలని 5 కోట్ల ఖర్చు చేసి 100 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న అమ్మాయి..!

ప్రచారంలో భాగంగా నా పోస్టర్లు చించివేయడంతో.. అధికారులకు ఫిర్యాదు చేశాం. కాని అక్కడ పరిస్థితి మార్పులొకి రాలేదని తెలిపాడు. అక్కడ అతను కేవలం బిజెపి ప్రభుత్వాన్ని ప్రశంసించానని, అయితే అతని పోస్ట్‌లు తనను “ఫాసిస్ట్” అని పిలవడానికి కారణమైనట్లు అయన చెప్పుకొచ్చాడు. ఇక విద్యార్థి సంఘం ఎన్నికల కోసం తన మ్యానిఫెస్టో గురించి మాట్లాడుతూ.., క్యాంపస్‌లోని నిజమైన సమస్యలను పరిష్కరించడం గురించి సత్యం చెప్పారు. నా మొత్తం బృందంతో, నేను క్యాంపస్ మొత్తం వెళ్లాను. మేము డిపార్ట్‌మెంట్ల వారీగా చేరుకుని మా విధానాలను వివరిస్తున్నాము. నేను చాలా బాగా రూపొందించిన మేనిఫెస్టో సంబంచిన విషయాలు నచ్చడంతో.. అక్కడ మాకు మద్దతు లభిస్తోంది. ప్రజలు నాకు ఓటు వేస్తారని చెప్పారు,” సత్యం చెప్పారు.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తో ఉన్న తన ఫోటోతో తనను బీజేపీతో ముడిపెట్టడానికి ఉపయోగించారని విద్యార్థి చెప్పాడు.