
Bengaluru cafe blast: బెంగళూర్ నగరంలోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనకు సంబంధించి కీలక నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. పేలుడు ఘటనకు సహాయసహకారాన్ని అందించిన ముజమ్మిల్ షరీఫ్‌ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ సహా 18 ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. తూర్పు బెంగళూర్‌లోని ఐటీ కారిడార్‌లో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు.
Read Also: Pakistan: పాకిస్తాన్-చైనా స్నేహానికి శత్రువులే ఈ దాడికి పాల్పడ్డారు..
పేలుడులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ఉపయోగించినట్లు తేలింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కస్టమర్ వేషంలో కేఫ్‌లోకి వచ్చి అక్కడే బాంబు ఉన్న బ్యాగును పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి బాంబు పేలింది. ఈ ఘటనలో ఒక్కసారిగా దేశం అలెర్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. నిందితుడికి సంబంధించిన పలు వీడియోలు ఎన్ఐఏ విడుదల చేసి, నిందితుడిని గుర్తించేందు ప్రజల సాయాన్ని కోరింది.
ఈ కేసులో ముఖ్య నిందితుడు ముస్సావిర్ షజీబ్ హుస్సేన్ని ఉగ్రవాద దర్యాప్తు సంస్థ గుర్తించింది. మరో కుట్రదారుడు అబ్దుల్ మతీన్ తాహానున కూడా ఏన్ఐఏ గుర్తించింది. వీరిద్దరు పలు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నారు. ఎన్ఐఏ ప్రకారం.. ముజిమ్మిల్ షరీఫ్ ఐఈడీని కేఫ్‌లో నిందితులకు సహకరించాడు. వారికి లాజిస్టిక్ సపోర్టు అందించాడు. ముగ్గురు అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఏ మార్చి 17న సోదాలు నిర్వహించి, నగదు, పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. బాంబు పేలుడుకు సంబంధించిన సమాచారం అందించిన వారికి 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఎన్ఐఏ ప్రకటించింది.