Leading News Portal in Telugu

Sinitha Kejriwal: ఈడీపై కేజ్రీవాల్‌ సతీమణి తీవ్ర ఆరోపణలు



Sunitha

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై కేజ్రీవాల్ సతీమణి సునీతా తీవ్ర ఆరోపణలు చేశారు. కస్టడీలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను వేధిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తీవ్రంగా వేధిస్తున్నారంటూ మీడియాకు తెలియజేశారు. తన భర్త ఆరోగ్యం ఏ మాత్రం బాగా లేదని.. షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యం ఎంతోకాలం సాగదని.. ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: DC vs RR: భారీ స్కోరు చేసిన రాజస్థాన్‌.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే?

గురువారం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరిచారు. న్యాయస్థానం ఏప్రిల్ 1వరకు ఈడీ కస్టడీ పొడిగించింది. మరో ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా నాలుగు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. తిరిగి ఏప్రిల్ 1న హాజరు పరచాలని ధర్మాసనం తెలిపింది. దీంతో మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీలోనే కేజ్రీవాల్ ఉండనున్నారు.

ఇది కూడా చదవండి: Off The Record: పవన్‌ కల్యాణ్ టార్గెట్‌గా ముద్రగడ అడుగులు?

అరెస్ట్, ఈడీ కస్టడీ నుంచి విముక్తి కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. కానీ ఇక్కడ రిలీఫ్ దొరకలేదు. కేసు విచారణ వారం పాటు వాయిదా వేసింది. ఇక సీఎం పదవి నుంచి కేజ్రీవాల్‌ను తప్పించాలంటూ వేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఈడీ కస్టడీ నుంచే  కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటికే రెండు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే జైలు నుంచి పరిపాలించడం కుదరదని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా వ్యాఖ్యానించారు. దీనిపై ఆప్ మంత్రులు మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Tillu Square: టిల్లు స్క్వేర్‌కి ఏమైంది? మీడియా షోతో పాటు యూఎస్ ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్?