Leading News Portal in Telugu

BJP: రాహుల్ గాంధీ కన్నా అడవి ఏనుగులే వయనాడ్‌కి ఎక్కువ సార్లు వచ్చాయి.. బీజేపీ అభ్యర్థి కామెంట్స్..



Rahul Gandhi

BJP: కేరళ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ అభ్యర్థి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న కే. సురేంద్రన్, రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలకు దిగారు. అటవీ ఏనుగుల దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో..‘‘ వయనాడ్‌లో అటవీ ఏనుగు దాడి చేయడం వల్ల మరొకరు చనిపోయారు. మినీ ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కేరళలో ముఖ్యంగా వయనాడ్‌లో మనుషులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణ పీడకలగా మారింది’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Read Also: K Padmarajan: “గెలుపెరగని యోధుడు”.. 238 సార్లు ఓడినా మళ్లీ ఎన్నికలకు సిద్ధం..

రాహుల్ గాంధీ వయనాడ్‌కి వచ్చిన దాని కన్నా అటవీ ఏనుగులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తున్నాయని సురేంద్రన్ విమర్శించారు. వయనాడ్ ప్రాంతంలో ఇటీవల కాలంలో మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంక్షోభాన్ని నివారించడంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కేరళ సీఎం పనరయి విజయన్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

రాహుల్ గాంధీ వయనాడ్‌కి తరుచుగా వెళ్లడంపై అధికార సీపీఎంతో పాటు బీజేపీ తీవ్రంగా విమర్శి్స్తోంది. ఈ ప్రాంతంలో ఏనుగుల దాడిపై ఆయన స్పందించకపోవడంపై అక్కడి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి ఓట్లపైనే ఆసక్తి ఉందా..? అతను వయనాడ్‌కి వచ్చిన దాని కన్నా అటవీ ఏనుగులే పట్టణానికి ఎక్కువగా వచ్చాయని అన్నారు. అతడు ప్రజల ప్రాణాలపై ఉదాసీనంగా ఉన్నాడు, ప్రజలు కష్టాల్లో ఉంటే పాలుపంచుకోకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి ఆనందిస్తాడని, రాహుల్ గాంధీ ఈ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పే సమయం వచ్చిందని సురేంద్రన్ అన్నారు.