
సార్వత్రిక ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని రాహుల్ ప్రకటించారు. ఈ మేరకు మహిళలకు రాహుల్ హామీ ఇచ్చారు. ఇప్పటికే మేనిఫెస్టోలో భాగంగా మహిళలపై అనేక వరాలు కురిపించారు. ఈసారి ఎన్నికల్లో మహిళలే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నారు. శక్తిమంతమైన మహిళలు దేశ భవితవ్యాన్ని మారుస్తారని రాహుల్ వ్యాఖ్యానించారు.
పని చేసే వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే మహిళ ఉన్నారని తెలిపారు. అంతే కాకుండా ప్రతి 10 మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే స్త్రీలు ఉన్నారని చెప్పారు. భారతదేశంలో మహిళల జనాభా 50 శాతం ఉన్నప్పటికీ హయ్యర్ సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించలేరా అని రాహుల్ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Atrocious: కూలర్‌ను శుభ్రం చేయనందుకు కొడుకుపై తండ్రి కత్తితో దాడి..
దేశాన్ని నడిపే ప్రభుత్వంలో మహిళలకు సమాన సహకారం ఉన్నప్పుడే మహిళల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోగలమని రాహుల్ వివరించారు. దేశంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం రిక్రూట్‌మెంట్‌ను మహిళలకే కేటాయించాలని పార్టీ నిర్ణయించిందని.. ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా పార్లమెంట్, అసెంబ్లీలో కూడా మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని రాహుల్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Yarlagadda Venkat Rao: యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత వీరాంజనేయులు
ఇదిలా ఉంటే తాజాగా ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ మండిపడుతోంది. నోటీసులను నిరసిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిరసనలకు పిలుపునిచ్చింది. శనివారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర విభాగాలను కోరారు. పీసీసీ ప్రధాన కార్యాలయాల దగ్గర, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయాల దగ్గర ధర్నా చేయాలని అధిష్టానం ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది.
ఇది కూడా చదవండి: Baltimore Bridge Collapse: బాల్టిమోర్ ఘటనలో ఇండియన్ సిబ్బందిని అవమానించేలా రేసిస్ట్ కార్టూన్..