
బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోతీహరిలో భార్య, ముగ్గురు పిల్లలను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు భర్త ఇద్దుమియాన్. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు.. వారిని హత్య చేసి ఇంటి నుండి పారిపోయాడు. అయితే.. నిందితుడు ఇద్దును పట్టుకున్న వారికి మోతిహరి పోలీసులు రూ. 15,000 రివార్డు ప్రకటించారు. అందుకోసం నేరస్థుడిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని చోట్లా గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా.. ఇద్దు ఇంతకుముందు సీతాపూర్‌లో నివాసముంటున్న తన మొదటి భార్యకు సంబంధించి ఇద్దరు పిల్లలను రైలు నుండి తోసి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అయితే.. అందులో ఒక పిల్లవాడు మరణించగా.. మరొక పిల్లవాడు గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత.. గత రాత్రి తన రెండో భార్య అఫ్రీనా ఖాతున్, ముగ్గురు పిల్లలను తన ఇంట్లోనే గొంతు కోసి హత్య చేశాడు.
ఇద్దు మియాన్ కుటుంబం 4 సంవత్సరాల క్రితం గ్రామానికి వచ్చి స్థిరపడింది. ఇద్దు తన కుటుంబాన్ని ఎందుకు చంపాడనేది ఇంకా వివరాలు తెలియలేదు. హత్య చేసిన అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. అయితే.. మృతదేహాలను చూసిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్, డాగ్ స్క్వాడ్‌లతో ఇంట్లో సోదాలు చేశారు. అంతకుముందు ఇద్దూ తన పిల్లలను రైలు నుంచి తోసేసిన ఘటనలో జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలై బయటికి వచ్చాక కుటుంబ సభ్యులందరినీ దారుణంగా హతమార్చి, ఆపై రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కుటుంబ కలహాల కారణంగానే ఇద్దు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య ఘటనపై వివరాలు ఇంకా తెలియరాలేదు.. విచారణ కొనసాగుతోంది.