Leading News Portal in Telugu

Tejaswini Gowda: కర్ణాటకలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత..



Tejaswini Gowda

Tejaswini Gowda: లోక్‌సభ ఎన్నికల ముందు కర్ణాటకలో బీజేపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నెల తర్వాత, బీజేపీకి చెందిన తేజస్విని గౌడ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరుతున్న క్రమంలో ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం లేదని ఆరోపించారు.

Read Also: Kailash Gahlot: ముగిసిన కైలాష్ గహ్లోట్ ఈడీ విచారణ.. మీడియాతో ఏమన్నారంటే..!

2004-2009 మధ్య కాంగ్రెస్ ఎంపీగా ఉన్న తేజస్విని గౌడ, 2014లో బీజేపీలో చేరారు. ఈ రోజు సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌లో చేరడాన్ని ఆమె సొంతింటికి తిరిగి రావడంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, పవన్ ఖేరాల సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. కర్ణాటక రాజకీయాల్లో క్రియాశీలక నేత తేజస్వని గౌడను కాంగ్రెస్‌లోకి స్వాగతిస్తు్న్నామని జైరాం రమేష్ అన్నారు.

కాంగ్రెస్ కేవలం మాటలు మాత్రమే చెప్పదని, పనులు కూడా చేస్తుందని, చిత్తశుద్ధితో పనిచేయాలని అనుకుంటున్నానని తేజస్విని గౌడ అన్నారు. మాజీ జర్నలిస్ట్ అయిన ఈమె రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలోని 28 సీట్లలో 23 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2014లో బీజేపీలో చేరిన తేజస్విని 2018లో ఎమ్మెల్సీగా గెలిచిన ఈమె పదవీ కాలం జూన్ 2024తో ముగియనుంది.