Leading News Portal in Telugu

Saina Nehwal: కాంగ్రెస్ ఎమ్మెల్యే ‘‘వంటగది’’ వ్యాఖ్యలపై సైనా నెహ్వాల్ ఆగ్రహం..



Saina Nehwal

Saina Nehwal: బీజేపీ నేత గాయత్రి సిద్దేశ్వరపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మహిళల్ని తక్కువగా చూపించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు సెలబ్రెటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు వంటింటికే పరిమితం కావాలని 92 ఏళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని బ్యాట్మింటన్ స్టాన్ సైనా నెహ్వాల్ ఖండించారు. ఇలాంటి దృక్కోణాల నుంచి బయటపడాలని సూచించారు.

Read Also: Pakistan: చుక్కల్ని అంటుతున్న పెట్రోల్ ధరలు.. లీటర్ రూ. 290

‘‘మహిళల్ని వంటింటికే పరిమితం చేయాలి-ఇది కర్ణాటక అగ్రనేత షామనూర్ శివశంకరప్ప జీ చెప్పిన మాట. బీజేపీ దావణగెరె అభ్యర్థి గాయత్రి సిద్దేశ్వరని ఉద్దేశించి చేసిన సెక్సిస్ట్ వ్యాఖ్యలు’’ లడ్కీ హూ, లడ్ శక్తి హూ అని చెప్పే పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఆశించలేము అని కాంగ్రెస్‌ని ఉద్దేశించి ఎక్స్ వేదికగా సైనా ట్వీట్ చేశారు. ‘‘ నేను మైదానంలో భారత్ తరుపున పతకాలు గెలిచినప్పుడు, నేను ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇష్టపడుతోంది..? అని ఎద్దేవా చేశారు. ‘‘ అమ్మాయిలు, ఆడవాళ్లందరూ తమకు నచ్చని ఏ రంగంలోనైనా పెద్ద విజయాలు సాధించాలని కలలు కంటున్నప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నారు..? ఒక వైపు నారీశక్తిని గౌవిస్తున్నాం, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. మరో వైపు నారీశక్తిని, స్త్రీలపై ద్వేషపూరితంగా వ్యాఖ్యలు చేస్తూ అగౌరపరుస్తుండటంతో నిజంగా కలత చెందుతున్నాను’’ అని సైనా ఆవేదన వ్యక్తం చేశారు.

దావణగెరె సౌత్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివశంకరప్ప కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆయన కోడలు ప్రభా మల్లికార్జున్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్దేశ్వరని విమర్శిస్తూ మహిళలు వంటింటికే పరిమితం కావాలని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన గాయత్రి సిద్దేశ్వర.. ‘‘ఈ రోజు ఆడవాళ్లు ఏ వృత్తిలో లేరు..? ఆకాశంలో కూడా ఎగురుతున్నాం. ఆడవాళ్లు ఎంత అభివృద్ధి చెందారో ఆ ముసలివాడికి తెలియదు, ఆడవాళ్లందరూ ఇంట్లో మగవాళ్లకు, పిల్లలకు, పెద్దవాళ్లకు ఎంత ప్రేమతో వంట చేస్తారో తెలియదు’’ అని స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశారు.