Leading News Portal in Telugu

Mamata Banerjee: 400 సీట్లు కాదు, కనీసం 200 గెలిచి చూపించాలి.. బీజేపీకి మమతా సవాల్..



Mamata Banerjee

Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్లను సాధించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి టార్గెట్ పెట్టుకుంది. స్వతహాగా బీజేపీ 370 స్థానాలను సాధించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే, బీజేపీ లక్ష్యాన్ని ఎద్దేవా చేస్తూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బెంగాల్ కృష్ణానగర్ జరిగిన కార్యక్రమంలో ఆమె బీజేపీని సవాల్ చేశారు.

Read Also: Arvind Kejriwal: ఇండియా కూటమి ర్యాలీలో ఆప్ ‘ 6 హమీలు’.. బీజేపీపై కేజ్రీవాల్ భార్య ఫైర్..

400 సీట్లు కాదు, కనీసం 200 స్థానలను గెలవాలని దీదీ బీజేపీని సవాల్ చేశారు. బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని తాను అనుమతించబోమని ఆమె చెప్పారు. సీఏఏ కోసం దరఖాస్తు చేసుకుంటే విదేశీయులుగా మారుతామని, దాని కోసం దరఖాస్తు చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 ప్లస్ సీట్లు సాధిస్తామని అన్నారు, కానీ 77 వద్దే ఆగిపోయారని ఆమె గుర్తు చేశారు.

సీఏఏ చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చడానికి ఒక ఉచ్చు అని, వెస్ట్ బెంగాల్‌లో సీఏఏని, ఎన్ఆర్సీని అనుమతించమని చెప్పారు. బీజేపీతో కాంగ్రెస్, సీపీఎం చేతులు కలిపాయని ఆమె ఆరోపించారు. బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని మహువా మోయిత్రాకు మద్దతుగా నిర్వహించి లోక్‌సభ ప్రచారంలో పాల్గొన్నారు.