
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు. అయితే ఈ సందర్భంగా కేజ్రీవాల్ న్యాయస్థానానికి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. తనకు జైల్లో చదువుకునేందుకు రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా ఛౌదరీ రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ తన న్యాయవాది ద్వారా అప్లికేషన్ సమర్పించారు. అలాగే ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్స్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తన ఒంటిపై ఉన్న లాకెట్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Tillu Square: టిల్లు గాడు మెగాస్టార్‌కి పిచ్చపిచ్చగా నచ్చేశాడు!
మద్యం కుంభకోణం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం తిరిగి కోర్టులో హాజరపరచగా ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీ కొనసాగించింది. దీంతో సోమవారం (ఏప్రిల్ 1) మళ్లీ కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్న తీహార్ జైలుకు పంపించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జైల్లో పుస్తకాలు చదివేందుకు అందుబాటులో ఉంచాలని కోరారు.
ఇది కూడా చదవండి: Ram Charan: బ్యాంకాక్ లో చిల్ అవుతున్న ఉపాసన, రామ్ చరణ్ లు.. పిక్స్ వైరల్..
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టు సమయంలో అతని ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నామని.. కానీ వాటి పాస్‌వర్డ్‌ను చెప్పడం లేదని ఈడీ కోర్టుకు చెప్పింది. ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని.. మళ్లీ అవసరమైనప్పుడు రిమాండ్‌ను కోరుతామని ఈడీ ధర్మాసనానికి తెలిపింది. కేజ్రీవాల్‌ను దాదాపు 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. ప్రతి రోజూ 5 గంటలకు పైగా 50 గంటల పాటు విచారించినట్లు ఈడీ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఇది కూడా చదవండి:Vijayasai Reddy: వాలంటరీ, సచివాలయ వ్యవస్థలను కూల్చడమే చంద్రబాబు ఉద్దేశం