Leading News Portal in Telugu

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఏం తేల్చిందంటే..!



Kavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఈడీ తరపున న్యాయవాదులు-కవిత తరపున న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం బెయిల్ పిటిషన్ విచారణ ఏప్రిల్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. ఇక ఈడీ రిప్లై రిజాయిన్డర్‌కు కవిత తరపు లాయర్ సమయం కోరారు. ఏప్రిల్ 3 సాయంత్రానికి రిజాయిన్డర్ దాఖలు చేస్తామని కవిత తరపు న్యాయవాదులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Hrithik – NTR: డాన్స్‌లో సమ ఉజ్జీల సమరం అంటే ఏంటో చూస్తారు.. గెట్ రెడీ!

తన కుమారులకు పరీక్షలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కవిత కోరారు. దీంతో న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. కవిత బెయిల్‌పై ఈడీ తన సమాధానం ఇచ్చింది. మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్‌పై రెండింటికీ ఈడీ తన వాదనలు వినిపించింది. ఇక కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎలాంటి బెయిల్ కావాలని కోరుకుంటున్నారో.. తేల్చుకోవాలని అభిషేక్ సింఘ్వీకి న్యాయస్థానం సూచించింది. విచారణను కోర్టు ఏప్రిల్ 4కు వాయిదా వేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: Chandrababu: టీడీపీ కేడర్‌తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. పింఛన్లపై కీలక ప్రకటన

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు హైదరాబాద్‌లో ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం ఈడీ కస్టడీకి అప్పగించింది. తిరిగి కోర్టులో హాజరపరచగా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వడంతో కవితను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కవిత ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఏం తేల్చిందంటే..!

ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్ జైలుకు అధికారులు తరలిస్తున్నారు. ఇక జైల్లో చదవుకునేందుకు రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా ఛౌదరీ రాసిన హౌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ డిసైడ్‌ వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ తన న్యాయవాది ద్వారా అప్లికేషన్ సమర్పించారు. అలాగే ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్స్‌, డైట్‌ ప్రకారం ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తన ఒంటిపై ఉన్న లాకెట్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.