
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు. 10 రోజుల పాటు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 1న కస్టడీ ముగియడంతో సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశే ఎదురైంది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Ruhani Sharma: హేయ్ రుహానీ, నువ్వేనా.. ఇంత దారుణమైన సీన్లో దర్శనమిచ్చావ్ఏంటి?
ఇకపోతే కేజ్రీవాల్ న్యాయస్థానానికి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. తనకు జైల్లో చదువుకునేందుకు రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా ఛౌదరీ రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ తన న్యాయవాది ద్వారా అప్లికేషన్ సమర్పించారు. అలాగే ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్స్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. లాకెట్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.
ఇది కూడా చదవండి: AP Pensions: పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టు సమయంలో అతని ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నామని.. కానీ వాటి పాస్‌వర్డ్‌ను చెప్పడం లేదని ఈడీ కోర్టుకు చెప్పింది. ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని.. మళ్లీ అవసరమైనప్పుడు రిమాండ్‌ను కోరుతామని ఈడీ ధర్మాసనానికి తెలిపింది. కేజ్రీవాల్‌ను దాదాపు 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. ప్రతి రోజూ 5 గంటలకు పైగా 50 గంటల పాటు విచారించినట్లు ఈడీ తెలిపింది.
#WATCH | Delhi CM Arvind Kejriwal brought to Tihar Jail where he will be lodged in Jail Number 2. He has been sent to judicial custody till April 15 in Delhi liquor policy case. pic.twitter.com/JM3m3J1gms
— ANI (@ANI) April 1, 2024