Leading News Portal in Telugu

Man kills wife: కట్నంగా ఫార్చ్యునర్ కారు​ ఇవ్వలేదని.. భార్యను చంపేసిన భర్త..!



Noida

గ్రేటర్​ నోయిడాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. వరకట్న వేధింపులతో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. కట్నం కింద ఫార్చ్యునర్ కారు​తో పాటు 21 లక్షల రూపాయల క్యాష్​ ఇవ్వలేదన్న కారణంతో.. మహిళ భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెను చిత్రహింసలకు గురి చంపేశారు. గ్రేటర్​ నోయిడాలోని ఖాడా చౌగన్​పూర్​ అనే గ్రామంలో నివాసం ఉండే వికాస్​ అనే వ్యక్తికి.. 2022 డిసెంబర్ ​లో కరిష్మ అనే మహిళతో పెళ్లి అయింది. అప్పుడు కట్నం కింద వికాస్​ కుటుంబానికి 11లక్షల రూపాయల క్యాష్ తో పాటు ఒక ఎస్​యూవీ కారుని కరిష్మ తల్లిదండ్రులు ఇచ్చారు.

Read Also: RCB vs LSG Dream 11 Prediction: బెంగళూరు, లక్నో డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

కానీ, పెళ్లి తర్వాత కూడా కట్నం గురించి కరిష్మను వికాస్ కుటుంబ సభ్యులు వేధించడం మొదలు పెట్టారు. ఇక, కరిష్మ సోదరుడు దీపక్ మాట్లాడుతూ..​వికాస్​ కుటుంబం అనేకసార్లు నా సోదరిని భౌతికంగా, మానసికంగా హింసించారు అని పేర్కొన్నాడు. కొన్ని నెలల క్రితం వికాస్​-కరిష్మలకు ఆడ బిడ్డ పుట్టింది.. ఇక, అప్పటి నుంచి కట్నం వేధింపులు మరింత పెరిగాయన్నాడు. ఈ వ్యవహారం స్థానిక పంచాయతీ పెద్దల దృష్టికి కూడా వెళ్లాం.. రెండు కుటుంబాలు కలిసి విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించామని దీపక్ వెల్లడించారు.

Read Also: Bandi Sanjay: ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసింది..! బండి కీలక వ్యాఖ్యలు

అయినా కూడా తమ కుటుంబం వికాస్​ ఫ్యామిలీకి మరో 10 లక్షలు రూపాయలు ఇచ్చిందని మృతురాలి సోదరుడు దీపక్​ చెప్పాడు. అప్పటికీ వరకట్న వేధింపులు ఆగలేదని చెప్పుకొచ్చాడు. కాగా.. కట్నం వేధింపులు ఇటీవలే నెక్ట్స్​ లెవల్​కి వెళ్లాయి. వికాస్​ కుటుంబం.. ఒక ఫార్చ్యునర్ ​తో పాటు 21 లక్షల రూపాయలను కట్నం కింద డిమాండ్​ చేయడం మొదలు పెట్టింది అని అతడు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు వికాస్ తో పాటు అతడి కుంటుంబ సభ్యులు కొడుతున్నట్లు మృతురాలు కరిష్మ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఇక, విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన కరిష్మ అత్తగారి ఇంటికి రావడంతో అప్పటికే ఆమె విఘత జీవిగా పడి ఉంది. వికాస్​, అతని తల్లిదండ్రులే వరకట్నం కోసం తమ బిడ్డను కొట్టి చంపేశారని కరిష్మ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.