
Sand: నిర్మాణ రంగంలో నానాటికి ఇసుక కొరత పెరుగుతోంది. దీనికి చెక్ పెట్టేలా బెంగళూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) శాస్త్రవేత్తలు నిర్మాణంలో ఉపయోగించేందుకు ఇసుకకు ప్రత్యామ్నాయాన్ని రూపొందించారు. IISc సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ (CST)లోని బృందం పారిశ్కామిక వ్యర్థ వాయువుల నుంచి సంగ్రహించబడిన కార్బన్ డయాక్సైడ్(CO2)ని ఉపయోగించుకునే పద్ధతులను అన్వేషిస్తోంది. శాస్త్రవేత్తలు తవ్విని మట్టి, నిర్మాణ వ్యర్థాలను ఈ CO2తో శుద్ధి చేసి ఇసుకకు ప్రత్యామ్నాయాన్ని రూపొందించారు.
Read Also: Komatireddy: కేబుల్ బ్రిడ్జ్ వేసి అభివృద్ధి అంటున్నారు.. కేసీఆర్ పై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
‘‘ ఇసుకను పాక్షికంగా భర్తీ చేయడానికి ఈ పదార్థాలు ఉపయోగించవచ్చు. ఇది నిర్మాణరంగంలో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా, నిర్మాణంలో ఇసుకు వినియోగాన్ని మెరుగుపరచగల లక్షణాలను కూడా అందిస్తుంది’’ అని IISc ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరదీప్ గుప్తా నేతృత్వంలోని పరిశోధక బృందం CO2తో ట్రీట్మెంట్ చేయబడిన నిర్మాణ వ్యర్థాలను మోర్టార్(ఇసుక, నీరు, సిమెంట్)లో ఉపయోగించడం, దీని తర్వాత వాతావరణంలోని అధికంగా ఉండే CO2తో క్యూరింగ్ చేయడంతో దాని బలం మరింత పెరుగుదలను మరింత వేగవంతం చేస్తుంది. ఈ వినూత్న ప్రక్రియ మెటీరియర్ కంప్రెన్సివ్ స్ట్రెంత్‌ని 20-22 శాతం పెంచుతుంది. దీనికి అదనంగా CO2ను బంకమట్టి లోకి ప్రవేశపెట్టడం ద్వారా, సున్నం, సిమెంట్‌తో దాని పరస్పర చర్యల్ని మెరుగుపరుస్తుంది. ఇది మట్టిని స్థిరీకరించడమే కాకుండా దాని ఇంజనీరింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది.
సిమెంట్-లైమ్ మట్టి మిశ్రమాన్ని సృష్టించేందుకు, సంగ్రహించిన CO2ను, తవ్విన మట్టిలో చేర్చారు. ఇది కట్టడాల్లో ఉపయోగించే మోర్టార్( ఇసుక, నీరు, సిమెంట్)ని సగం వరకు భర్తీ చేస్తుంది. ఈ టెక్నిక్ కాల్పియం కార్బోనేట్ స్పటికాలు ఏర్పడటాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మెరుగైన బలాన్ని ఇవ్వడంతో పాటు క్రాక్స్ని నిరోధిస్తుంది. ఈ పదార్థాలు బయట ఉన్న CO2కి గురికావడంతో క్యూరింగ్ ప్రక్రియ మరింత వేగం అవుతుంది. ఇది ఎర్లీ-ఏజ్ స్ట్రెంత్‌ని 30 శాతం వరకు పెంచుతుంది. పరిశోధకులు సిమెంట్, స్లాగ్, ఫ్లైయాష్ వంటి బైండర్లతో కలిపి స్థిరీకరించబడిని మట్టిని ఉపయోగించి 3D-ప్రింటెడ్ పదార్థాలను కూడా అభివృద్ధి చేశారు. ఈ పదార్థాలు అత్యుత్తమ ప్రింటబిలిటీని అందిస్తాయి, సిమెంట్ మరియు ఇసుక అవసరాన్ని ఒక్కోటి 50% వరకు తగ్గించగలవు.