Leading News Portal in Telugu

PM Modi: తైవాన్ మృతులకు మోడీ సంతాపం.. త్వరగా కోలుకోవాలని ట్వీట్



Mpoe

తైవాన్‌లో సంభవించిన భూకంపం మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. బుధవారం తైవాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణనష్టం జరగడం పట్ల మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తైవాన్‌ ప్రజలు ధృడంగా ఉండాలన్నారు. తిరిగి వేగంగా కోలుకోవాలని.. మీకు సంఘీభావం తెల్పుతున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

భారీ భూకంపం తైవాన్‌ సహా జపాన్‌ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘోర విపత్తు సంభవించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.2గా గుర్తించారు. తైవాన్‌లోని హువాలియెన్‌ పట్టణానికి నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరం, 35 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్‌ వెల్లడించింది.

ఈ భూకంపం కారణంగా పలు భవనాలు నేలకొరిగాయి. మరికొన్ని పగుళ్లు వచ్చాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక వాహనాలు, రైళ్లు భారీ కుదుపులతో ప్రజలంతా బెంబేలెత్తిపోయారు. 1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ భూకంపం కారణంగా దాదాపు ఏడుగురు చనిపోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.