Leading News Portal in Telugu

Opinion poll: మళ్లీ అధికారం బీజేపీదే.. ఎన్డీఏకి 399 స్థానాలు..



Bjp

Opinion poll: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తిరుగులేదని మరో సర్వే తేల్చి చెప్పింది. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్‌ పోల్‌లో మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ ఎన్డీఏ ఏకంగా 399 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, బీజేపీకి సింగిల్‌గా 342 సీట్లు వస్తాయని తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి (తృణమూల్ కాంగ్రెస్ మినహాయించి) 94 స్థానాలను గెలుచుకుంటుందని, టీఎంసీ, వైఎస్సార్సీపీ, బీజేపీ, స్వతంత్రులు కలిసి 50 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేసింది.

ఒపీనియన్ పోల్‌కి సంబంధించి మార్చి 1 నుంచి మార్చి 30 వరకు 543 ఎంపీ స్థానాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించింది. మొత్తం 1,79,190 మంది అభిప్రాయాలను సేకరించగా.. వీరిలో 91,100 మంది పురుషులు మరియు 88,090 మంది మహిళలు ఉన్నారు.

పార్టీల వారీగా సీట్లు:

బీజేపీ: 342
కాంగ్రెస్: 38
టీఎంసీ: 19
డీఎంకే: 18
జేడీయూ: 14
టీడీపీ: 12
ఆప్: 06
సమాజ్ వాదీ పార్టీ: 03
ఇతరులు: 91

పలు రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్:

గుజరాత్ రాష్ట్రంలోని 26 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 29 సీట్లు, రాజస్థాన్‌లో 25 సీట్లు, హర్యానాలోని 10 సీట్లు, ఢిల్లీలోని 07 సీట్లు, ఉత్తరాఖండ్ లోని 05 సీట్లు, హిమాచల్ ప్రదేశ్‌లోని 4 సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే అంచనా వేసింది. ఇక అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 73 సీట్లను కైవసం చేసుకుంటుందని అంచనా.

రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే:

* ఆంధ్రప్రదేశ్: మొత్తం 25 (వైఎస్‌ఆర్‌సీపీ 10, టీడీపీ 12, బీజేపీ 3)

* అస్సాం: మొత్తం 14(BJP 11, AGP 1, UPPL 1, AIUDF 1, కాంగ్రెస్ 0)

* బీహార్: మొత్తం 40 ((BJP 17, JD-U 14, RJD 1, LJP(R) 5, HAM 1, RLM 1, కాంగ్రెస్ 1)

* ఛత్తీస్‌గఢ్: మొత్తం 11 (బీజేపీ 10, కాంగ్రెస్ 1)

* గోవా: మొత్తం 2 (బీజేపీ 2)

* గుజరాత్: మొత్తం 26 (బిజెపి 26)

* హర్యానా: మొత్తం 10 (బిజెపి 10)

* హిమాచల్ ప్రదేశ్: మొత్తం 4 (BJP 4)

* జార్ఖండ్: మొత్తం 14 (BJP 12, AJSU 1, JMM 1)

* కర్ణాటక: మొత్తం 28 (బీజేపీ 22, జేడీఎస్ 2, కాంగ్రెస్ 4)

* కేరళ: మొత్తం 20 (UDF 10, LDF 7, NDA 3)

* మధ్యప్రదేశ్: మొత్తం 29 (బిజెపి 29)

* మహారాష్ట్ర: మొత్తం 48 (బిజెపి 27, శివసేన-యుబిటి 7, ఎన్‌సిపి (అజిత్) 2, శివసేన-షిండే 8, ఎన్‌సిపి-శరద్ 2, కాంగ్రెస్ 1, ఇతరులు 1)

* మణిపూర్: మొత్తం 2 (బీజేపీ 1, కాంగ్రెస్ 1)

* మేఘాలయ: మొత్తం 2 (NPP 1, కాంగ్రెస్ 1)

* మిజోరం: మొత్తం 1 (ZPM 1)

* నాగాలాండ్: మొత్తం 1 (NDPP 1)

* ఒడిశా: మొత్తం 21 (BJD 11, BJP 10)

* పంజాబ్: మొత్తం 13 (AAP 6, కాంగ్రెస్ 3, BJP 3, SAD 1)

* రాజస్థాన్: మొత్తం 25 (బిజెపి 25)

* సిక్కిం: మొత్తం 1 (SKM 1)

* తెలంగాణ: మొత్తం 17 ( బీజేపీ 05, కాంగ్రెస్ 09, బీఆర్ఎస్ 02, ఎంఐఎం 01)

* తమిళనాడు: మొత్తం 39 (డీఎంకే 18, ఏఐఏడీఎంకే 4, బీజేపీ 3, కాంగ్రెస్ 8, పీఎంకే 1, ఇతరులు 5)