Leading News Portal in Telugu

Karnataka: హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది



Hic

కర్ణాటక హైకోర్టు దగ్గర తీవ్ర కలకలం రేగింది. ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఒక్కసారి న్యాయస్థానం పరిసరాలు కలవరపాటుకు గురయ్యాయి. దీంతో భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. బుధవారం కోర్టు హాల్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్ నీలయ్ విపిన్ చంద్ర అంజారియా, న్యాయవాదులు, తదితరులు ఉన్నారు. మైసూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టు హాల్ ఒకటి దగ్గరకు వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బందికి ఫైల్ అందజేసి వెంటనే తనతో పాటు తీసుకొచ్చిన కత్తి తీసుకొని గొంతు కోసుకున్నాడు. ఈ హఠాత్తు పరిణామంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని సమీపంలోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Vasantha Krishna Prasad: డబ్బులు లేకే పెన్షన్‌ పంపిణీ వాయిదా..!

ఇదిలా ఉంటే శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం తర్వాత చీఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు లోపల ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. శ్రీనివాస్ కత్తితో లోపలికి ఎలా వచ్చాడు.. ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించాలని పోలీసులను చీఫ్ జస్టిస్ ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Health Tips : మధుమేహానికి చెక్ పెట్టే సూపర్ జ్యూస్.. ఎలా తీసుకోవాలంటే?