Leading News Portal in Telugu

Boy Falls Into Borewell: బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..​!



1

నేటి ఉదయం రెండేళ్ల బాలుడు ప్రమదావశాత్తు కర్ణాటకలోని విజయపుర జిల్లాలో పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు. ఈ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు మొదలు పెట్టారు. బోరుబావిలో పడ్డ బాలుడిని సాత్విక్ ముజగొండగా అధికారులు గుర్తించారు. బాలుడుకిని కాపాడేందుకు గత కొన్ని గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు సంబంధిత అధికారులు. విజయపుర జిల్లాలోని లచయానా గ్రామానికి సతీశ్​ ముజగొండ తన 4 ఎకరాల పొలంలో బోరుబావిను తవ్వంచాడు.

Also Read: DC vs KKR: ఇషాంత్ శర్మ సూపర్‌ యార్కర్‌.. కిందపడిపోయి క్లీన్‌బౌల్డ్ అయిన రస్సెల్!

అయితే, బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు సాత్విక్. పడిపోయిన అబ్బాయి దాదాపు 16 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా బాలుడికి మొదటగా పైపుల ద్వారా ఆక్సిజన్ ను​ అందిస్తున్నట్లు వివరించారు. అయితే., బాలుడి కదలికలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక హెల్త్ ఆఫీసర్ డా. అర్చన నేతృత్వంలో వైద్యుల బృందం సిద్ధంగా ఉంది.

Also Read:DC vs KKR: 166 పరుగులకే ఆలౌట్.. ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం

ఇక గ్రామంలోని సిద్దలింగ మహారాజు సన్నిధిలో సాత్విక్ క్షేమంగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు స్థానికులు చేస్తున్నారు. చుడాలిమరి బాబును ఎంత త్వరగా బయటికి తీసుకొస్తారో అధికారులు.