
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన అభ్యర్థులను వెల్లడించింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లును అధిష్టానం ప్రకటించింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వడోదర, సురేంద్రనగర్, జునాగఢ్ స్థానాలకు అభ్యర్థుల్ని వెల్లడించారు. వడోదరకు నుంచి జష్పాల్సింగ్ పాధియార్ పోటీ చేయనున్నారు.
ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించింది. మరికొన్ని స్థానాలకు ఇంకా అభ్యర్థుల్ని వెల్లడించాల్సి ఉంది. శుక్రవారం కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మరికొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు కూడా అభ్యర్థులను డిసైడ్ చేయనున్నారు. అమేథీ నుంచి ఈసారి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఖమ్మం స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. అటు తర్వాత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న చివరి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.