Leading News Portal in Telugu

Amritpal Singh: వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ తల్లి అరెస్ట్.. కారణం ఇదే..



Amritpal Singh

Amritpal Singh: వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తల్లిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు జైలును మార్చాలని డిమాండ్ చేస్తూ ఆమె మార్చ్‌కి పిలుపునిచ్చింది. దీంతో ఆమెను అమృత్‌సర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకును అస్సాం దిబ్రూగఢ్ జైలు నుంచి మార్చాలని డిమాండ్ చేస్తూ ఆమె ‘చేత్నా మార్చ్’కి పిలుపునిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Akhilesh Yadav: రష్యాలో అలెక్సీ నవల్నీని విష ప్రయోగంతో చంపలేదా..? గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి అఖిలేష్ మద్దతు..

పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడంతో పాటు పోలీస్ స్టేషన్‌పై అమృత్‌పాల్ సింగ్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో పాటు అతనికి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని ఏప్రిల్ 2023లో అరెస్ట్ చేసిన అస్సాం జైలుకి తరలించారు. అతడినితో పాటు అతని అనుచరుల్లో కొందర్ని దిబ్రూగడడ్ జైలులో ఉంచారు. అక్కడి నుంచి అతడిని పంజాబ్ జైలుకు మార్చాలని అతడి తల్లి సోమవారం మార్చ్‌కి పిలుపునిచ్చింది. భటిండా లోని తఖ్త్ దమ్‌దామా సాహిబ్ నుంచి బయలుదేరాల్సిన ‘చేత్నా మార్చ్’కి ఒక రోజు ముందు ఆదవారం అమృత్‌పాల్ సింగ్ తల్లి బల్వీందర్ కౌర్, అతడి మామ సుఖ్‌చైన్ సింగ్, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.