
Supreme Court: వాతావరణ మార్పుల హెచ్చరికలను ప్రపంచం గుర్తించింది. 2070 నాటికి ‘జీరో ఎమిషన్స్’ సాధించాలనే భారత్ అంతర్జాతీయ నిబద్ధతకు మద్దతు లభించింది. ఇదిలా ఉండగా.. వాతావరణం, జీవావరణం మధ్య సమతుల్యతను పాటించాలని సుప్రీంకోర్టు మొదటిసారిగా ఆదేశాలు ఇచ్చింది. బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి మారడం, దాదాపు అంతరించిపోయిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (GIB) పక్షిని రక్షించడం వంటి వాటిని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు సమతుల్యతను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షిని గోదావన్ అని కూడా పిలుస్తారు, ఇది రాజస్థాన్‌లో కనిపిస్తుంది.
సుప్రీంకోర్టు 2019 ఉత్తర్వులను రద్దు చేసింది..
2019 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తులు రద్దు చేశారు. ఆ ఉత్తర్వు.. రాజస్థాన్, గుజరాత్‌లలో 90,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విద్యుత్ ప్రసార మార్గాలను నిషేధించింది. సౌర విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తుంది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 450 గిగావాట్లకు (GW) పెంచాలనే భారతదేశ లక్ష్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది.
Read Also: Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రే మమ్మల్ని ‘‘ఇంటి పనివారి’’గా చూశాడు.. ఇదే శివసేన చీలికకు కారణం..
కొత్త నిర్ణయం ఏమిటి?
ఇప్పుడు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి యొక్క 13,000 చదరపు కిలోమీటర్ల కోర్ ఆవాసాన్ని మినహాయించి, 77,000 చదరపు కిలోమీటర్లలో విద్యుత్ ప్రసార మార్గాలపై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ కేసు నిర్ణయాన్ని ఆదివారం అప్‌లోడ్ చేసింది. దీని ప్రకారం, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడం, పక్షులను రక్షించడం మధ్య సమతుల్యతను సాధించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. విద్యుత్ తీగలు ఢీకొని చాలా పక్షులు చనిపోతాయని, అందుకే పర్యావరణవేత్త ఎం.కె. రంజిత్ సింగ్ వాదనల ఆధారంగా హై ఓల్టేజీ వైర్లపై నిషేధం విధించారు.
దీనిపై విచారణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది..
ఈ అంశాన్ని క్షుణ్ణంగా విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు సభ్యులతో కూడిన కొత్త నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను జులై 31లోగా ప్రభుత్వం ద్వారా కోర్టుకు సమర్పించనుంది. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలను బెంచ్ అంగీకరిస్తూ.. ‘పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే భారత్ నిబద్ధత, ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగానే ఉంది. ‘ ఈ ఆదేశాలు ఇచ్చింది.