Leading News Portal in Telugu

Ghulam nabi azad: ఎన్నికల్లో ఆజాద్ పోటీపై వీడని ఉత్కంఠ!



Ghulam Nabi Azad

డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ వ్యవస్థాపకుడు గులాం నబీ ఆజాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మరోసారి సందిగ్ధత నెలకొంది. మొదట్లో పోటీ చేయడం లేదని ప్రచారం జరిగినా.. అనంతర పరిణామాల నేపథ్యంలో పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి పోటీపై సందిగ్ధత నెలకొంది. ఇటీవలే ఆ పార్టీ క్రేడర్.. ఆజాద్‌ను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరాయి. దీనికి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే మళ్లీ ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ఆయన పోటీపై వెనుకడుగు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సీనియర్‌ ఐపీఎస్ అధికారి హఠాన్మరణంపై సీఎం దిగ్భ్రాంతి

తొలుత అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. 2022లో కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి ఆజాద్ కొత్త పార్టీ స్థాపించారు. దీంతో ఆజాద్ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ స్థాపించి.. ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. దీంతో అనంత్‌నాగ్ సీటుపై జమ్మూకాశ్మీర్‌లో ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: Memantha Siddham Bus Yatra: మళ్లీ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్‌

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని ఓ మీడియా ఛానల్‌కు ఆజాద్ తెలిపారు. తాను పోటీ చేయాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారని.. కానీ తాను మాత్రం తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఇక అనంత్‌నాగ్ నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరపున మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. ఇక ఆజాద్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తే గట్టి పోటీ నెలకొననుంది.

ఇది కూడా చదవండి: Uttarakhand: ఘోరం.. లోయలో పడ్డ బొలెరో వాహనం.. 8 మంది మృతి

ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక హోదాను ఆగస్టు 2019లో రద్దు చేసినప్పటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌లో ఆరేళ్ల నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. గత సంవత్సరం ఈ అంశంపై పిటిషన్‌లను విచారించిన సుప్రీంకోర్టు అసెంబ్లీ ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది. సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని తెలిపింది.

ఇది కూడా చదవండి: RCB Fan: ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పింది.. ఐపీఎల్ మ్యాచ్‌కు వెళ్లి బాస్‌కు దొరికిపోయింది!

మెహబూబా ముఫ్తీ 2004, 2014లో అనంత్‌నాగ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2019లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది దాదాపు 10 వేల ఓట్లతో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన గులామ్ అహ్మద్ మీర్ రన్నరప్‌గా.. మెహబూబా ముఫ్తీ మూడో స్థానంలో నిలిచారు. అనంత్‌నాగ్-రాజౌరీ స్థానానికి మే 7న మూడో దశలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతుంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.

ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్‌ కొత్త ప్రతిజ్ఞ.. కలకలం రేపుతున్న నెతన్యాహు వ్యాఖ్యలు