Leading News Portal in Telugu

Weather update: ఈ రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ



Aeke

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే తాజా వాతావరణ పరిస్థితులపై కేంద్ర వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. కొన్ని రాష్ట్రాల్లో హీట్‌వేవ్ కొనసాగుతుందని.. మరికొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని.. దీంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్పింది.

ఇది కూడా చదవండి: Bandi Sanjay: ఎన్నికల కోడ్ ముగిసేలోపు నేతన్నల డిమాండ్లన్నీ పరిష్కరించాల్సిందే..

దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో హీట్‌వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేకంగా ఉత్తర కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ హీట్ ఉందని చెప్పారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా ఉందని పేర్కొన్నారు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం ఈ రాష్ట్రాల్లో అక్కడకక్కడ ఉరుములతో కూడిన వర్షపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని శుభవార్త చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడిగాలులు వీస్తాయని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Saripodhaa Sanivaaram: ఉగాది వేళ నాని ‘సరిపోదా శనివారం’ నుంచి కొత్త పోస్టర్!

ఇదిలా ఉంటే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి. అక్కడకక్కడ చిరు జల్లులు కూడా కురిశాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వర్షం కురిసింది. దీంతో ఎండ వేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. ఉక్కపోత నుంచి పిల్లలు, వృద్ధులు బయటపడ్డారు. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం.. రాష్ట్రంలో ఎండ వేడిమి నుంచి కొన్ని రోజులు తప్పించుకునే పరిస్థితులు రావొచ్చు.