
భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల నజరానా మోగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంలో ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. మొత్తం 7 విడతలుగా భారతదేశంలోని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇకపోతే ఇందుకు సంబంధించి ఆయా పార్టీలు వారి అభ్యర్థులను బరిలో దింపగా వారు పెద్ద ఎత్తున ప్రచారాలను చేపడుతున్నారు.
Also Read: Dhoni Jadeja: గురువుకు తగ్గ శిష్యుడు.. ఆ విషయంలో ధోనిని సమం చేసిన జడ్డు భాయ్..!
ఇక మరోవైపు లోక్ సభ ఎన్నికల నిబంధనల భాగంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకాకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పశ్చిమబెంగాల్ పోలింగ్ కోసం వాడే అన్ని రకాల వాహనాలకు సంబంధించి జిపిఎస్ లోకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తున్నట్లు కూడా వారు తెలిపారు. ఇక ఎన్నికలు నేపథ్యంలో ఈవీఎంలు సహా ఇతర ఎన్నికల సామాగ్రికి సంబంధించిన మొత్తం వ్యవహారానికి అవసరమయ్యే వాహనాలకు, పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించే ముందు నుండి అలాగే పోలింగ్ అనంతరం ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో తీసుకొచ్చి భద్రపరిచేతవరకు జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థను వాడబోతున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. దీంతో ఎన్నికల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
Also Read: Anchor Suma : పండగొస్తే చాలు సుమ పని ఇదే.. ఏంటి సుమక్క ఎప్పుడు ఇదేనా?
ఇక ఈ విషయం సంబంధించి ఎలాంటి అవకతవకలను గుర్తిస్తే ఎలక్షన్ కమిటీ సభ్యులు వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. ఇకపోతే పోలింగ్ కేంద్రాలకు ఉపయోగించే వాహనాల డ్రైవర్లతోపాటు పోలింగ్ బాధ్యతలను నిర్వహించునున్న సదరు అధికారులను కూడా ప్రశ్నిస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.