Leading News Portal in Telugu

Uttar Pradesh: 26 ఏళ్ల హత్య కేసులో నిందితుడు అరెస్ట్..



Arrest

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఓ హత్య కేసులో నిందితుడు.. 26 ఏళ్లుగా వెతుకుతున్న 50 ఏళ్ల మిత్లేషియా ఉత్తమ్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 1999లో రాజ్‌కోట్‌లోని జెట్‌పూర్‌లోని టైల్స్ ఫ్యాక్టరీలో ఓ వాచ్‌మెన్ ను హత్య చేశాడు. ఈ కేసులో మిత్లేషియా పటేల్‌ను నిందితుడిగా చేర్చారు. కాగా.. ఈ ఘటనపై క్రైమ్ ప్రివెన్షన్ బ్రాంచ్ విచారణ చేపట్టింది.

Read Also: Chandrababu: సైకిల్ స్పీడుకు తిరుగు లేదు.. గ్లాసు జోరుకు అడ్డు లేదు..

వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు మిత్లేషియా పటేల్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఫ్యాక్టరీలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. అది గమనించిన వాచ్‌మెన్‌ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారు వాచ్‌మెన్‌ తలపై రాయితో దాడి చేశారు. దీంతో వాచ్‌మెన్‌కు తీవ్రగాయాలు కావడంతో అతడు మృతి చెందాడు.

Read Also: Chandrababu: సైకిల్ స్పీడుకు తిరుగు లేదు.. గ్లాసు జోరుకు అడ్డు లేదు..

ఈ హత్య కేసులో నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లా రుక్మా ఖుర్ద్ గ్రామంలో తలదాచుకున్నట్లు సమాచారం అందింది. దీంతో యూపీ పోలీసులు పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. గత 26 ఏళ్లుగా నిందితుడు గుజరాత్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో తలదాచుకున్నాడు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని జైలుకు తరలించారు.