Leading News Portal in Telugu

Ghaziabad: బాలికపై తల్లి స్నేహితుడు అత్యాచారం, చిత్రహింసలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!



Rape

ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. ఒక మహిళ ఇద్దరి పిల్లలతో స్థానికంగా నివాసం ఉంటుంది. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె మరొకరితో సహజీవనం చేస్తోంది. అయితే మహిళ లేని సమయంలో 10 ఏళ్ల కుమార్తెపై ఆ కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. అంతేకాకుండా ఆ బాలిక సోదరుడి(13)పై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విషయాన్ని పిల్లలు తల్లికి చెబితే.. కామాంధుడికి బుద్ధి చెప్పాల్సింది పోయి.. ఆ కసాయి తల్లి పిల్లల్నే చిత్రహింసలకు గురిచేసింది. దీంతో ఆమె బాధల్ని తట్టుకోలేక పిల్లలిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు బండారం బయటపడింది. దీంతో ఆ బాలిక తల్లిని, ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Memantha Siddham Bus Yatra: 13వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్‌ ఇదే..

జనవరి 20న ఇంట్లో లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఢిల్లీకి పారిపోయింది. వీధుల్లో తిరుగుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. అనంతరం వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెపై అత్యాచారం జరిగిందని తేలింది. అనంతరం ఆమె నుంచి పోలీసులు వివరాలు సేకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Janata Bar Movie: హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రాయ్ లక్ష్మీ.. హీరో ఎవరంటే?

బాలిక తండ్రి నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. ఆమె తల్లి రాజు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. రాజు.. బాలిక, బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తల్లి లేని సమయంలో బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి తెగబడ్డాడు. దీంతో విషయాన్ని తల్లికి చెబితే.. ఆమె ప్రియుడు రాజుకే సపోర్ట్ చేసింది. విషయం బయటకు పొక్కకుండా బిడ్డల్ని చిత్రహింసలకు గురి చేసింది. దీంతో బాలుడు ఇంట్లో నుంచి ముందే పారిపోగా.. బాలిక మాత్రం జనవరి 20న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారన్న విషయాన్ని ఆమె ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రియుడితో సంతోషంగా గడుపుతోంది. కనీసం పిల్లలు ఏమయ్యారన్న విషయాన్ని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తన తల్లి పెద్దయ్యాక.. తనను వ్యభిచారం కూపంలోకి నెట్టేస్తాదేమోనన్న భయంతో ఇంట్లో నుంచి పారిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక తల్లి, ప్రియుడు రాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి: Noida: గ్రావిటీ మంత్ర రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం