
దేశ వ్యాప్తంగా జోరుగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇక బీజేపీ నుంచి బాలీవుడ్ హీరోయిన్లు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. హిమాచల్‌ప్రదేశ్ మండీ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్, ఉత్తరప్రదేశ్ మథుర నుంచి హేమ మాలిని బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు నడుచుకుంటున్నారు. ఇటీవల కంగనా రనౌత్.. మండీలో అభిమానుల కోరిక మేరకు డ్యాన్స్ చేసి ఉత్సాహపరిచారు. తాజాగా హేమ మాలిని కూడా వ్యవసాయ కూలిగా అవతారమెత్తారు. పొలంలోకి వెళ్లి కూలీలతో కలిసి గోధుమ పంటను కోశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పదేళ్లుగా క్రమతం తప్పకుండా రైతులతో మమేకం అవుతున్నట్లు హేమ మాలిని ఎక్స్ వేదికగా ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే ఈసారి కూడా రైతులతో కలిసి పని చేసినట్లు తెలిపారు. రైతుల మధ్య ఇలా ఉండడం తనకు ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. హేమ మాలిని పొలంలోకి రావడంతో రైతులు, కూలీలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మథుర నియోజకవర్గం నుంచి హేమ మాలిని మూడోసారి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా వ్యవసాయ పొలాల్లోకి దిగి ఫొటోలకు ఫోజులిచ్చారు. కూలీలతో కలిసి కొంతసేపు గోధుమ పంటను కోశారు.
మథుర నియోజకవర్గం బీజేపీకి కంచుకోట లాంటిది. 2014, 2019 ఎన్నికల్లో హేమ మాలిని ఇక్కడ విజయం సాధించారు. ఆమె భర్త ధర్మేంద్ర కూడా ప్రచారం నిర్వహించారు. మరోసారి విజయం కోసం హేమ మాలిని రంగంలోకి దిగారు. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోడీ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 3 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఇండియా కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపాయి.
ఇక దేశ వ్యాప్తంగా ఏడు దిశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did
pic.twitter.com/iRD4y9DH4k
— Hema Malini (@dreamgirlhema) April 11, 2024