
Ayodhya Temple: శ్రీరామనవమి వేడుకలకు భవ్య రామమందిరం ముస్తాబవుతోంది. ఈ వేడుకలను చూసేందుకు అయోధ్యకు లక్షలాది మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అయోధ్య సిద్ధమవుతోంది. అయోధ్యతో పాటు 800 మఠాలు, దేవాలయాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్తాలతో పాటు వేల క్వింటాళ్ల పూలతో అలంకరించనున్నారు. అయోధ్య నగర వ్యాప్తంగా 100కి పైగా ఎల్‌ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు.
Read Also: PM Modi: శ్రావణంలో మటన్ తింటూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు.. రాహుల్, లాలూపై విమర్శలు..
మరోవైపు రామనమవి రోజున అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిషృతం కాబోతోంది. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు తాకేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బాలరాముడికి సూర్య తిలకం ఏర్పాట్లపై ఈ రోజు మధ్యాహ్నం రిహార్సల్స్‌ని ఆలయ కమిటీ పూర్తి చేసింది. రిహార్సల్ సమయంలో సూర్య కిరణాలు రాముడి నుదుటిని తాకాయి. రాముడి వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది అయోధ్యకు తరలివచ్చే నేపథ్యంలో యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. రామ నవమికి వచ్చే లక్షలాది మంది భక్తులకు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు 600 మీటర్ల మేర జర్మన్ హ్యాంగర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఎండలకి భక్తుల పాదాలు కాలిపోకుండా కార్పెట్ సిద్ధం చేస్తున్నారు. రామనవమి అయిన ఏప్రిల్ 17వ తేదీన అయోధ్య నగరం సుందరంగా ముస్తాబు కానుంది.