
Jammu Kashmir: సార్వత్రిక ఎన్నికల వేళ టెర్రరిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో టార్గెటెడ్ కిల్లింగ్‌కి పాల్పడ్డాడు. బీహార్ నుంచి వచ్చిన వలస కూలీని లక్ష్యంగా చేసుకుని హతమార్చారు. ఈ ఘటన అనంత్ నాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. బీహార్‌కి చెందిన వలసకూలీని చంపినట్లుగా బుధవారం అధికారులు తెలిపారు. మృతుడిని రాజు షాగా గుర్తించారు.
Read Also: Earthquake: జపాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదు
ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాజు షాని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇది గత 10 రోజుల్లో రెండో దాడి. ఈ దాడి తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అయితే, తమ ఉనికిని చాటుకోవడానికి ఉగ్రవాదులు అమాయకులైన వలస కూలీలను లక్ష్యం చేసుకుంటూ దాడులకు పాల్పడుతున్నారు.
ఇదిలా ఉంటే అనంత్ నాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులను బుధవారం ఆర్మీ అరెస్ట్ చేసింది. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా బుధవారం అనంత్ నాగ్ లోని నైనా, బిజ్‌బెహరా వద్ద ఇండియన్ ఆర్మీ, కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశాయి. వారి వద్ద నుంచి ఒక ఆయుధం, హ్యాండ్ గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నారు.