Leading News Portal in Telugu

Kejriwal: కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీకి మరో షాక్.. తాజా ఆదేశాలు ఇవే



Parsonal

సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగలుతున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ వేటు వేసింది. అక్రమంగా నియామకం జరిగిందంటూ ఆయన్ను తొలగించింది. ఈ నిర్ణయాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) కూడా సమర్థించింది. తాజాగా సివిల్ లైన్స్ నివాసాన్ని ఖాళీ చేయమని బిభవ్ కుమార్‌కు ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఆదేశించడంతో బుధవారం మరో షాక్‌ తగిలినట్లైంది.

ఇది కూడా చదవండి: PM Modi: తొలి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ, ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని లేఖ..

ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ హోదాలో బిభవ్ కుమార్‌కు ఢిల్లీలోని చంద్రవాల్ వాటర్ వర్క్స్-II, సివిల్ లైన్స్‌లో 2021 మార్చి 31న ఇల్లు కేటాయించబడింది. ఇటీవలే ఆయనపై వేటు పడడంతో తాజాగా ప్రభుత్వం కేటాయించిన నివాసాని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. 10-05-2024లో ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.

ఇది కూడా చదవండి: Delhi HC: లవ్ ఫెయిల్యూర్‌తో ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే, మహిళను బాధ్యులు చేయలేము..

ఏప్రిల్ 10న బిభవ్ కుమార్‌ను విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ తొలగించింది. 2007లో ప్రభుత్వ ఉద్యోగి తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు బిభవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అతనిపై కేసు ఉన్న కూడా బిభవ్ కుమార్‌ను చట్ట విరుద్ధంగా నియమించినట్లుగా విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ భావించింది. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కూడా బిభవ్ కుమార్‌కు ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను సీఎం వ్యక్తిగత కార్యదర్శి పదవి నుంచి తొలగించింది.

ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. తాజాగా వ్యక్తిగత డాక్టర్ కోసం.. మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కేజ్రీవాల్ కోరారు.