Leading News Portal in Telugu

Lok sabha elections 2024: నాలుగో దశకు నేడు నోటిఫికేషన్‌



Election Commission

Lok sabha elections 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం మొదలైంది. మొదటి దశ ప్రచార పర్వం బుధవారంతో ముగిసింది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించనున్నారు. అందులో భాగంగా నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధం అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్‌ జరుగనుంది. గురువారం ఉదయం నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఆ తర్వాత ఈ విడతకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ 96 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఏప్రిల్‌ 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకొనేందుకు అవకాశం కలి్పంచారు.

Read Also:Time Magazine: టైమ్‌ మేగజీన్‌ 2024 లో ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో భారతీయులు.. వివరాలు ఇలా..

10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 26న జరుగనుంది. అనంతరం ఏప్రిల్‌ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. కాగా నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశి్చమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు యూపీలో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో 8 సీట్లు, బీహార్‌లో 5, జార్ఖండ్‌, ఒడిశాలలో 4 సీట్లు, జమ్మూ కశ్మీర్‌లోని ఒక్క సీటుకు నాలుగో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిషాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగో విడతలో పోలింగ్‌ జరుగనుంది.

Read Also:Pushpa 2 : భారీ ధరకు పుష్ప 2 నార్త్ ఇండియా రైట్స్..