Leading News Portal in Telugu

Viral Video: ఇదేందీ భయ్యా.. పూజారులు భక్తులపై కర్రలతో దాడి..



3

మనం ఏ గుడికైనా, ఏ ప్రార్థన మందిరానికి వెళ్లిన అక్కడ ఉన్న పూజారులు దేవుడికి పూజలు చేసి వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తారు. కాకపోతే., తాజాగా కొందరు భక్తులను గుడిలోని పూజారులు అలాగే ఆలయ సిబ్బంది కర్రలతో కొట్టిన సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంకా ఈ సంఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని సహరిన్ పూర్ కు చెందిన కొందరు వ్యక్తులు సిద్ధ బీట్ లోని దక్షిణ ఖాళీ మందిరం సందర్శానికి వచ్చారు. వారు దేవుడిని దర్శించుకునేందుకు బైకులపై వచ్చారు. కాకపోతే అక్కడ ఆలయంలో పార్కింగ్ చేసే అంశంపై భక్తులకు, పూజారులకు ఆలయ సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది.

ఇలా మాటలతో వాగ్వాదం జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో ఆలయ సిబ్బంది అలాగే పూజారులు కలిసి భక్తులపై దాడి చేశారు. ఈ దాడిలో పూజారులు ఆలయ ఇబ్బంది కలిసి భక్తులను కర్రలతో చావ బాధారు. దీంతో భక్తులు భయభ్రాంతులకు లోనై అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆలయం బయట వాహనాలపై వెళ్తున్న వారు కూడా ఈ దాడి వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఇక దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు. ఇకపోతే ఈ సంఘర్షణకు సంబంధించి ఎవరు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంఘర్షణకు సంబంధించి దారుణంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.