Leading News Portal in Telugu

Shocking Video: రేయ్ ఎవర్రా మీరంతా.. రోడ్డుపై వెళ్తున్న కారుకు వేలాడుతూ వెళ్తున్న వ్యక్తి.. చివరికి..



Viral Video

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ సెల్ ఫోన్ వాడుతూ రోజులో కొంత సమయాన్ని సోషల్ మీడియాని చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇకపోతే ప్రతిరోజు మనం అనేక చోట్ల ప్రమాదకర సంఘటనలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన విషయాలు, వీడియోలు మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం. కాకపోతే కొందరు యువత మాత్రం వాటిని చూసినా ఎలాంటి మార్పు రావట్లేదు.

Also read: Lok sabha election: కమలానికి తొలి విజయం.. ఎక్స్‌లో బీజేపీ కీలక ప్రకటన

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం చేయరాని పాట్లు పడుతూ.. కొన్నిసార్లు వారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కొందరైతే డేంజర్ స్టంట్ చేయడానికి కూడా వెనుకాడడం లేదంటే నమ్మండి. తాజాగా ఇలాంటి డేంజరస్ స్టంట్ సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించిన విశేషాలు చూస్తే..

Also read: Crystal Salt : కళ్లు ఉప్పు వాడుతున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..

కదులుతున్న కారు డోర్ కు ఓ వ్యక్తి తనను తాను వేలాడ తీసుకొని నవ్వుతున్న వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో కారు నడుపుతూ ఓ వ్యక్తి.. మరోవ్యక్తి వెనుక సిటీలో కూర్చుని నవ్వుతున్నట్లు ఈ వీడియోలో కనబడుతుంది. టేపుతో తనని తాను వేలాడ తీసుకున్న వ్యక్తి కూడా చిరునవ్వు ఇస్తుండడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం డేంజరస్ స్టంట్ కు సంబంధించి అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇందులో కొందరు.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై పెద్ద ఎత్తున విమర్శలను గుప్పిస్తున్నారు. మరికొందరైతే మీకు ఏమైనా పోయేకాలం వచ్చిందా.. ఇలా చేస్తున్నారంటూ అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇక ఈ వీడియోకు సంబంధించి పోలీసులు యాక్షన్ ఏవిధంగా తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

View this post on Instagram

A post shared by Sumit dubey (@sumit_cool_dubey)