Leading News Portal in Telugu

Shocking Video: ఉన్నట్టుండి ఎంత ఘోరం.. గోడపడి నలుగురి దుర్మరణం.. వీడియో వైరల్..



Viral Video

ప్రతి మనిషికి చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటివరకు ఎవరితో నైనా మాట్లాడడం, లేకపోతే ఏ పనిలోనైనా నిమగ్నమై ఉండడం ఎలా ఉన్న చావు నుండి మనం తప్పించుకోలేం. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో అనేకంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఓ స్మశాన వాటిక గోడకూలి నలుగురు దుర్మరణం చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also Read: New Life Girl: ఈ పాకిస్థాన్ యువతి ఎంత అదృష్టవంతురాలో.. ఏం జరిగిందో తెలిస్తే..!

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్ లోని స్థానిక అర్జుననగర్ లో ఉన్న స్మశాన వాటిక గోడ పక్కన కొందరు కూర్చుని సరదాగా మాట్లాడుతున్నారు. వారిలో ఓ 11 ఏళ్ల బాలికతో సహా మరో ముగ్గురు ఉన్నారు. అలాగే కాస్త వారికి దూరంగా మరో వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఉన్నటువంటి వారు కూర్చున్న పక్కనే ఉన్న స్మశానం సంబంధించిన గోడ ఒక్కసారిగా కుప్ప కూలింది. అయితే గోడ పడే సమయంలో దానిని గమనించిన వృద్ధులు కుర్చీలోంచి లేచి పక్కకు వెళ్లే ప్రయత్నం చేసే లోపే గోడ మొత్తం కూలిపోయి వారి మీద పడిపోయింది. అలాగే దూరంగా ఉన్న ఓ వ్యక్తి గోడ పడటం చూసి వేగంగా వెనక్కి జరగడంతో ప్రాణాలు దగ్గించుకున్నాడు.

Also Read: The Delhi Files: ది ఢిల్లీ ఫైల్స్ మొదలవుతోంది!

ఇక గోడ మీద పడ్డ నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో వారిని గోడ శిధిలాల నుండి బయటకు తీయగా ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపల వారు మృతి చెందారు. మృతి చెందిన వారిలో తాన్య (11), దేవి దయాల్ (70), మనోజ్ గబా (54) కృష్ణ కుమార్ (52) ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.