Leading News Portal in Telugu

Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి కాల్పులు.. ఒక జవాన్ మృతి..



Moist

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మ‌రో సారి కాల్పుల మోత కొనసాగుతుంది. డిస్ట్రిక్ట్ రిజ‌ర్వ్‌డ్ గార్డ్ జవాన్లకు అలాగే, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు జరుగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జ‌వాను తన ప్రాణాలను కోల్పోయారు. కాగా, దంతెవాడ జిల్లా బార్సూర్ ప‌రిధిలోని హంద‌వాడ‌, హిత‌వాడ‌లో మావోయిస్టులు ఉన్నార‌నే స‌మాచారంతో డీఆర్‌జీ ( డిస్ట్రిక్ట్ రిజ‌ర్వ్‌డ్ గార్డ్ ) పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. పోలీసుల క‌ద‌లిక‌ల‌ను కనిపెట్టిన మావోయిస్టులు.. ఒక్క సారిగా కాల్పులు చేయడం ప్రారంభించారు.

Read Also: YS Avinash Reddy: ఎందరు కలిసివచ్చినా జగన్‌ను టచ్ చేయలేరు..!

కాగా, మరో వైపు నుంచి కూడా పోలీసులు కాల్పులు చేయడంతో ఈ కాల్పుల్లోనే దంతెవాడ డీఆర్‌జీ కానిస్టేబుల్ జోగ‌రాజ్ క‌ర్మ మృతివాత పడ్డాడు. మ‌రో కానిస్టేబుల్ ప‌ర‌శురామ్‌కు సైతం తీవ్ర గాయాల‌య్యాయి. ఇక, కానిస్టేబుల్ ప‌ర‌శురామ్‌ను చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు. ఇక, కాల్పుల్లో ఇద్దరు మవోయిస్టులకు సైతం గాయాలు అయినట్లు సమాచారం. కాగా, ఎదురు కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో భద్రతా బ‌ల‌గాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.