Leading News Portal in Telugu

Mamata Banerjee: హెలికాప్టర్‌ ఎక్కుతూ జారిపడి పడిన మమతా బెనర్జీ.. మళ్లీ గాయాలు



Mamatha

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి గాయపడింది. దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కుతున్న టైంలో ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడిపోయింది. దీంతో స్వల్ప గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీదీ దుర్గానగర్‌కి వెళ్లారు. అక్కడ సభ ముగిసిన తర్వాత అక్కడి నుంచి మరో చోటకు వెళ్లాల్సిన ఉండగా.. హెలికాప్టర్‌ అప్పటికే రెడీగా ఉంది.. వేగంగా నడుచుకుంటూ వచ్చిన మమతా మెట్లు ఎక్కారు. లోపలి వరకూ బాగానే వెళ్లిన ఆమె.. అక్కడ కుర్చీలో కూర్చునే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Read Also: Nandyala: డిజిటల్ పేమెంట్స్ ఉంటేనే మద్యం

మమతా బెనర్జీ పడిపోవడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెని పైకి లేపారు. ఈ ఘటనలో ఆమెకి స్వల్ప గాయం అయినట్టుగా తెలుస్తుంది. ఆ తరవాత ఆమె షెడ్యూల్ ప్రకారం అసన్సోల్‌లోని టీఎంసీ నిర్వహించే బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే, ఇటీవలే ఆమె గాయపడి కోలుకున్నారు. కోల్‌కత్తాలోని ఇంట్లోనే మమతా బెనర్జీ జారి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమె తలకి తీవ్ర గాయమైంది. రక్తం కారుతున్న ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. అంతకు ముందు 2023 జూన్‌లోనూ దీదీకి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా హెలికాప్టర్‌ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అది ల్యాండ్ అయిన సమయంలోనే ఆమె కాలికి గాయమైన విషయం తెలిసిందే.