Leading News Portal in Telugu

Superstition: మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని రెండు రోజులపాటు నీటిలో ఉంచగా.. చివరకు..



Dead Body

ప్రపంచంలో టెక్నాలజీ ఎంత ముందుకుపోతున్న గాని కొంతమంది మూఢనమ్మకాలను నమ్ముతూ ఇంకా వెనుకబడి పోతున్నారు. ఇలా మూఢనమ్మకాలు నమ్మే వారిలో చదువుకొని వారు కాకుండా చదువుకున్న వారు అలాగే ఉద్యోగాలు చేసేవారు కూడా ఉండడం ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి విషయాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనం చూసాం. ఇకపోతే తాజాగా ఈ కోవకు సంబంధించి మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించి పూర్తిగా వివరాలు చూస్తే..

Also read: Kubera: ‘కుబేర’ నుండి నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్..

ఓ వ్యక్తి పాము కాటు కారణంగా చనిపోగా అతని మృతదేహాన్ని గ్రామస్తులు రెండు రోజులపాటు నీటిలో వేలాడదీసిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహార్ జిల్లా వైరంపూర్ కుదిన్యే గ్రామంలో ఈ మూఢనమ్మక సంఘటన జరిగింది. గ్రామంలోని మోహిత్ కుమార్ ఏప్రిల్ 26న పొలం పనులు చేస్తుండగా అనుకోకుండా పాము కాటు వేసింది. దానిని గమనించిన సదరు యువకుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడు దగ్గర చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే చికిత్సలో అతడు కోల్పోకపోవడంతో మృతి చెందాడు.

Also read: T20 World Cup 2024: రింకూ సింగ్‌ ఎంపిక చేయకపోవడంపై అసలు నిజం చెప్పేసిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్..

అయితే., మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలు చేయకుండా వారి తల్లిదండ్రులు ఎవరో చెప్పిన మాటలను విని నీటిలో కట్టి వేలాడదీస్తే బతికే అవకాశం ఉందని చెప్పడంతో అలానే చేశారు. ఈ విషయానికి గ్రామస్తులు కూడా అంగీకారం తెలపడంతో గ్రామస్థుల ఆధ్వర్యంలో సమీపంలో గంగా నదిలో తాడుతో కట్టి వేలాడదీశారు. ఇలా చేయడం ద్వారా ఒంట్లోని విషం వెళ్లిపోయి బతుకుతాడన్న మూఢనమ్మకంతో రెండు రోజులు పాటు నదిలో అతడి మృతదేహాన్ని వేలాడదిశారు. ఈ సందర్భంగా రెండు రోజుల వరకు అతనిలో ఎటువంటి చలనం కనిపించకపోవడంతో మృతదేహాన్ని పక్కనే ఉన్న ఘాట్ పై దహనం చేశారు.