Leading News Portal in Telugu

Congress: ఒకే రోజు మిగిలి ఉంది.. అయేథీ, రాయ్‌బరేలీపై ఖర్గే, రాహుల్ గాంధీ చర్చలు..



Rahul Gandhi

Congress: కాంగ్రెస్ కంచుకోటలైన అయేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై ఆ పార్టీ ఇంకా ఎటూ తేల్చడం లేదు. శుక్రవారంతో నామినేషన్ గడువుకు ముగుస్తున్న నేపథ్యంలో, అభ్యర్థి ఎవరనేదాన్ని కాంగ్రెస్ చెప్పడం లేదు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన పెరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ర్యాలీ తర్వాత ఇరువురు నేతలు అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిపై ఏ క్షణానైన ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read Also: Kim Jong Un: కిమ్ అరాచకం.. కోరికలు తీర్చడం కోసం ప్రతీ ఏడాది 25 మంది వర్జిన్ అమ్మాయిలు..

అయితే, రాహుల్ గాంధీ అయేథీ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మరో స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాయ్‌బరేలీలో తన తల్లి సోనియాగాంధీ స్థానంలో ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని అంచనాలు నెలకొన్నాయి. గత వారం నుంచి ఈ రెండు స్థానాలపై కాంగ్రెస్ జాప్యం చేస్తోంది. ఇటీవల గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా కోరుతూ రెండు రోజుల క్రితం అయేథీలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.

ఐదోదశ మే 20న రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, రాహుల్ గాంధీ అయేథీ నుంచి పోటీకి ఆసక్తి చూపడం లేదని సమాచారం. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ పరాజయం పాలయ్యారు. మరోవైపు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా తాను పోటీ చేసేందుకు ఆసక్తిని చూపించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.