
తమిళనాడులోని చెన్నైలో దారుణం జరిగింది. రెండు రోట్‌వీలర్స్.. ఐదేళ్ల చిన్నారిపై దాడికి తెగబడ్డాయి. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటినా తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ ఏరియాలోని పబ్లిక్ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం చిన్నారితో పార్క్‌లో ఉన్నప్పుడు ఈ దారుణం జరిగింది.
ఇది కూడా చదవండి: Anna Rambabu: జగనన్న మళ్లీ సీఎం అయితేనే మంచి జరుగుతుంది..
ఆదివారం సాయంత్రం చెన్నైలోని పబ్లిక్ పార్క్‌కి చిన్నారితో తల్లిదండ్రులు వెళ్లారు. రోట్‌వీలర్స్ జాతికి చెందిన రెండు కుక్కలను యజమాని నిర్లక్ష్యంగా విడిచిపెట్టేశాడు. దీంతో అమాంతంగా చిన్నారిపై ఎగిసిపడ్డాయి. ఎంత బెదిరించినా అవి విడిచిపెట్టలేదు. దీంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిర్లక్ష్యం వహించిన కుక్కల యాజమానిని అరెస్ట్ చేశారు. అలాగే కుక్కలను చూసుకునే మరో ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. తాజా సంఘటనతో పెంపుడు జంతువులపై చర్చ మొదలైంది.
ఇది కూడా చదవండి: Mango Ice Cream Paan : ఐస్ క్రీమ్ తో పాన్ ఏంట్రా బాబు.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..
పోలీసులు సమాచారం మేరకు.. చెన్నైలోని థౌజండ్ లైట్స్ ఏరియాలోని పబ్లిక్ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. యజమాని.. కుక్కలను విడిచిపెట్టాడని వారు చెప్పారు. కుక్కలు చిన్నారిపై దాడి చేశాయని.. తల్లిదండ్రులు రక్షించడానికి ప్రయత్నించినా యజమాని మాత్రం జోక్యం చేసుకోలేదని వెల్లడించారు. ఇదిలా ఉంటే చిన్నారి తండ్రి పార్కులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో యజమానితో పాటు కుక్కలను సంరక్షిస్తున్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి శేఖర్ దేశ్‌ముఖ్ తెలిపారు. పార్క్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఆ రెండు కుక్కలు కనిపించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పుకొచ్చారు.
పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్‌డాగ్, రోట్‌వీలర్, మాస్టిఫ్‌లతో సహా 23 జాతుల క్రూరమైన కుక్కల అమ్మకం మరియు పెంపకాన్ని నిషేధించాలని మార్చిలో కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇప్పటికే ఈ జాతులను పెంపుడు జంతువులుగా కలిగి ఉన్నవారు వాటిని ఒకేసారి క్రిమిరహితం చేయాలని ఆదేశాలు ఉన్నాయి. అలాగే కొన్ని జాతులను పెంపుడు జంతువులుగా ఉంచకుండా నిషేధించాలని పౌరుల ఫోరమ్‌లు, జంతు సంక్షేమ సంస్థల నుంచి ఫిర్యాదులు అందాయని పశుసంవర్ధక శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Radhika Khera: రాహుల్ గాంధీ యాత్రలో నాకు మద్యం ఆఫర్ చేశారు.. కాంగ్రెస్‌పై రాధికా ఖేరా సంచలన ఆరోపణలు..